వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో, వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (Agricultural and Processed Food Products Export Development Authority), నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (National Research Development Corporation)తో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది.
అగ్రి ఎక్స్పోర్ట్ పాలసీ అమలుకు, వ్యవసాయ ఎగుమతులను బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ప్రయోజనాల కొరకై ఈ రెండు సంస్థలు అవగాహనా ఒప్పొందాన్ని కుదుర్చుకున్నాయి.
సన్నకారు మరియు చిన్న తరహా రైతులకు అందుబాటుగా తక్కువ ధరలో వ్యవసాయ యంత్రాలను అభివృద్ధి చేయడం.వ్యవసాయ-ఎగుమతులకై NRDC ఇంక్యుబేషన్ సెంటర్ (NRDCIC)తో అనుసంధానించబడిన అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించడం.మరియు స్టార్టప్ ల వ్యవస్థను బలోపేతం చేయడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి.నేల పోషకాల నిర్వహణ, అధిక ఉత్పాదకత, మార్కెటింగ్ వంటి వివిధ సమస్యలను ఎదుర్కునే అంశాలపై ఈ విధానం ద్రుష్టి సారిస్తోంది.
న్యూ ఢిల్లీలోని APEDA ప్రధాన కార్యాలయంలో APEDA ఛైర్మన్ డాక్టర్ M. అంగముత్తు, IAS సమక్షంలో APEDA కార్యదర్శి మరియు NRDC CMD (Rtd) అమిత్ రస్తోగి ఈ MOUపై సంతకం చేశారు.
NRDC అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ( Department of Scientific and Industrial Research) యొక్క సంస్థ మరియు ఇది 1953లో సాంకేతికను ప్రోత్సహించే ప్రధాన ఉద్దేశ్యం తో స్థాపించబడింది.
APEDA గురించి తెలుసుకుందాం
Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, 1985 ప్రకారం భారత ప్రభుత్వంచే స్థాపించబడింది.
ఇది Ministry of Commerce and Industry మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది.
APEDAప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
విధులు
పండ్లు, కూరగాయలు మరియు వాటి ఉత్పత్తులు; మాంసం ఉత్పత్తులు; పౌల్ట్రీ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు; మిఠాయి, బిస్కెట్లు మరియు బేకరీ ఉత్పత్తులు; తేనె, బెల్లం మరియు చక్కెర ఉత్పత్తులు; తృణధాన్యాలు మరియు తృణధాన్యాలు ఉత్పత్తుల వంటి ఎగుమతులను APEDA నియంత్రిస్తుంది.
చక్కెర దిగుమతిని పర్యవేక్షించే బాధ్యత APEDAకి అప్పగించబడింది.
కబేళాలలో మాంసం మరియు మాంసం ఉత్పత్తులను తనిఖీ చేయడం
మరిన్ని చదవండి.
Share your comments