News

ICRISAT:అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఇక్రిశాట్ నిధులు, 50 లక్షల వరకు పొందండి

S Vinay
S Vinay

ఇక్రిశాట్(International Crops Research Institute for Semi-Arid Tropics) ఎంపిక చేసిన స్టార్టప్‌లకు 50 లక్షల వరకు నిధులు అందుతాయి. వ్యవసాయం, ఆహార సాంకేతికత, వ్యవసాయ యాంత్రీకరణ, వాతావరణ మార్పు వంటి రంగాలలో స్టార్ట్-అప్‌లకు ప్రాధాన్యత ఇస్తుంది.

ABI-ICRISAT సీనియర్ అధికారి, హెడ్ అరవాజి సెల్వరాజ్ మాట్లాడుతూ మేము ఉత్పత్తి-మార్కెట్ ఫిట్ వంటి అంశాలపై మంచి ప్రతిపాదనను కలిగి ఉన్న స్టార్టప్‌లతో కలిసి పని చేయాలని చూస్తున్నాము.అని వ్యాఖ్యానించారు.ఎంపిక చేసిన స్టార్టప్‌లకు 50 లక్షల వరకు నిధులు అందుతాయి. అప్లికేషన్ గడువు ఏప్రిల్ 30, 2022. ఇంక్యుబేటర్ ఖచ్చితమైన వ్యవసాయం(precise agriculture) , ఆహార సాంకేతికత,( food technology) వ్యవసాయ యాంత్రీకరణ( farm mechanization,) వాతావరణ మార్పు మరియు supply chain management.వంటి రంగాలలో స్టార్ట్-అప్‌లకు ICRISAT ప్రాధాన్యత ఇస్తుంది.

NIDHI-Seed Support Program అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాజెక్ట్. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతే కాకుండా కాన్సెప్ట్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్-ఎంట్రీ మరియు వాణిజ్యీకరణకు సంబంధించిన అంశాలలో స్టార్టప్‌లకు తగినంత సహాయం చేస్తుంది.

NIDHI Seed Support Program గురించి తెలుసుకుందాం :
గ్రాంట్-ఇన్-ఎయిడ్. స్టార్టప్‌లకు ప్రారంభించదాయినికి అర్హత కలిగిన ఇంక్యుబేటర్లకు రూ. 1000 లక్షల వరకు ఋణం

NIDHI-SSP కింద ఒక్కో స్టార్టప్‌కు రూ. 100 లక్షల వరకు సీడ్ సపోర్ట్.

,ఈక్విటీ లేదా ఈక్విటీ-లింక్డ్ సాధనాల ద్వారా స్టార్టప్‌లలో ఫైనాన్సింగ్/పెట్టుబడి చేయడం.

స్టార్టప్‌లకు అతి తక్కువ వడ్డీలకే ఋణాలు.

ICRISAT (International Crops Research Institute for the Semi-Arid Tropics) గురించి తెలుసుకుందాం
ఇది 1972 సంవత్సరంలో పఠాన్ చెరు, హైదరాబాద్ లో స్థాపించబడింది.ఇది ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కోసం వ్యవసాయ పరిశోధనలను నిర్వహించే అంతర్జాతీయ సంస్థ. నైజర్,నైజీరియా, మలావి, ఇథియోపియా, బులవాయో మరియు జింబాబ్వే వంటి దేశాలలో కూడా ICRISAT యొక్క పరిశోధన కేంద్రాలు ఉన్నాయి.

మరిన్ని చదవండి

BLACK RICE:రోగ నిరోధక శక్తిని పెంచే బ్లాక్ రైస్ గురించి తెలుసుకోండి

Share your comments

Subscribe Magazine