తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలైన ప్రజలు ఇళ్ళు నిర్మించుకోవాలనుకునే వారికీ రూ ..3 లక్షల ఆర్థిక సహాయం అందించేవిధంగా గృహలక్ష్మి పథకం క్రింద దరకాస్తుల స్వీకరణను ప్రారంభించింది ప్రభుత్వం కొన్ని జిలాల్లో ఆగస్టు 10 తేదీ వరకు దరకాస్తుల జిల్లా కలెక్టరేట్ లో సమర్పించాలని సూచించారు.
వరంగల్ జిల్లాలోని అర్హుల నుంచి గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం. ఆధార్, ఆహార భద్రత కార్డు ఉన్నవారు, ఆర్‌సీసీ స్లాబ్ ఇల్లు లేని వారు, జీఓ నంబరు 59 ద్వారా లబ్ధిపొందని వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
కుటుంబంలో మహిళ పేరుతో గృహలక్ష్మి పథకము మంజూరు అవుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత వివరాలు, ఇంటి నంబరు, ఫోన్ నంబరు, సామాజిక వర్గము వివరాలు, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీ (మహిళ పేరుపై), ఇల్లు కట్టదలుచుకున్న ఖాళీ ప్లాటు/స్థలం వివరాలు తెలుపుతూ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. దరఖాస్తులు సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయాల్లో, వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ నెల 10లోపు అందించాలని సూచించారు.
Share your comments