News

పెరగనున్న ఉల్లి ధరలు .. కిలో 70 వరకు చేరవచ్చు !

Srikanth B
Srikanth B
పెరగనున్న ఉల్లి ధరలు .. కిలో 70 వరకు చేరవచ్చు !
పెరగనున్న ఉల్లి ధరలు .. కిలో 70 వరకు చేరవచ్చు !

దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది దీనితో రానున్న రోజులలో టమాటో లగే ఇతర కూరగాయల ధరలు పెరగనున్నట్లు కొన్ని మార్కెట్ ఇంటలిజెన్స్ కమిటీలు అంచనా వేస్తున్నాయి కేవలం టమాటో మాత్రమే కాకుండా టమాటో మాదిరిగా వంటకాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఉల్లి ధరలు కూడా వచ్చే నెల లేదా ఈ నెల చివరి నాటికీ ధరలు పెరిగే అవకాశాలు వున్నాయి .

మార్కెట్‌కి టమాటాలు చాలా తక్కువగా వస్తున్నందున వీటి ధరలు హోల్‌సేల్‌లోనే దాదాపు కేజీ 200 రూపాయలుగా పలుకుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేనందున టమాటా కేజీ 300 రూపాయలకు చేరే అవకాశము లేకపోలేదని అంటున్నారు వ్యాపారస్తులు .

ఢిల్లిలోని అత్యంత పెద్దదైన ఆజాద్‌పూర్‌ కూరగాయల మార్కెట్‌లో కేజీ టమాటాలు 170-220 రూపాయలు పలుకుతోంది. కర్నాటక, మహారాష్ట్రలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో టమాటా కేజీ ధర 180-200 రూపాయల వరకు పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అతి మార్కెట్‌గా ఉన్న మదనపల్లిలోనూ కేజీ టమాటా 180-190 రూపాయల వరకు పలుకుంతోంది.

అమరావతి రైతులకు శుభవార్త.. త్వరలోనే డబ్బులు జమ..

ఉల్లి ధరలు ఈ నెలాఖరు వరకు పెరుగుతూ సెప్టెంబర్‌ నాటికి 60 నుంచి 70 రూపాయల వరకు చేరవచ్చని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ తెలిపింది. 2020 సంవత్సరం నాటికి ధరల కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సరఫరా డిమాండ్‌ అసమతౌల్యం ఆగస్టు చివరి నాటికి కనిపించవచ్చని అంచనా .

అమరావతి రైతులకు శుభవార్త.. త్వరలోనే డబ్బులు జమ..

Related Topics

onion cultivation

Share your comments

Subscribe Magazine