News

2000 రూపాయల నోట్లు మాయమవుతున్నాయా? షాకింగ్ న్యూస్ !

Srikanth B
Srikanth B
2000 రూపాయల నోట్లు మాయమవుతున్నాయా? షాకింగ్ న్యూస్ !
2000 రూపాయల నోట్లు మాయమవుతున్నాయా? షాకింగ్ న్యూస్ !

కొన్నేళ్ల క్రితం నోట్ల రద్దు 2000 రూపాయల నోటు అయితే ఒకరికి రెండు నోట్లు మాత్రమే వచ్చేవి. ఆ రెండు నోట్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో నిరీక్షించిన సంగతి తెలిసిందే. కానీ, నేడు సమాజంలో ఎక్కడ పెద్దగా ఈ 2000 రూపాయల నోట్లు కనిపించడంలేదు . దీని గురించి వివరణాత్మక సమాచారాన్ని ఈ కథనంలో చుడండి .

అప్పట్లో అందరి చేతుల్లో కనిపించే రూ.2000 నోట్లు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ఆ నోట్లన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? రూ.2000 నోట్లన్నీ నల్లధనంగా పేరుకుపోయాయన్న ప్రచారం నిజమేనా?

2016లో నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఒకవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బు చలామణి కూడా పెరిగింది.దేశంలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రకటన తర్వాత 2,000 రూపాయల నోట్లు వాడుకలోకి వచ్చాయి . ఇంత తక్కువ సమయంలో చెలామణిలో ప్రముఖంగా మారిన ఈ నోట్లను ఇప్పుడు చూడటం కష్టంగా మారింది."మేము రూ. 2,000 నోట్లను చూసి చాలా కాలం అయ్యింది" అని ప్రజలు చెబుతున్నారు డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ , సాంప్రదాయ కరెన్సీ నోట్లు కూడా దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ కోర్సు.. నవంబర్ 24 దరఖాస్తుకు చివరి తేదీ !

ఈ ఏడాది మార్చి 18 నాటికి దేశంలో రూ. 31.05 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి. నగదు లావాదేవీల్లో ఇది ఆల్ టైమ్ హై. ఈ రేటు ప్రకారం రూ.2000 నోట్లను మళ్లీ ముద్రించాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అదే సమయంలో నకిలీ రూ.2000 నోట్ల వినియోగం పెరిగింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో నకిలీ రూ.2000 నోట్ల ముద్రణలో 55 శాతం పెరిగినట్లు ఆర్బీఐ గమనించింది . రూ.2,000 నోట్లను రద్దు చేసినప్పటికీ , దేశ ఆర్థిక వ్యవస్థలో వాటి వినియోగాన్ని దశలవారీగా తగ్గించే పని ప్రణాళికాబద్ధంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది .

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ కోర్సు.. నవంబర్ 24 దరఖాస్తుకు చివరి తేదీ !

Share your comments

Subscribe Magazine