సోషల్ మీడియా పుణ్యమాని నేటి సమాజంలో ఏది నిజమో ఏ వార్త అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఏ పుకార్లు కొన్ని అంశాలలో ప్రజాలనును చాల ఇబ్బంది పెడుతుంటాయి అల్లాంటిదే ఈ 10 రూపాయల నాణేలు చెల్లడంలేదనే వార్త వాస్తవానికి రూ.10 నాణేలు చెల్లుతాయి RBI ఎం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం .
శనివారం నగరంలోని కలెక్టరేట్ సభాంగణంలో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పలు చోట్ల రూ.10 నాణేన్ని ఆర్‌బీఐ నిషేధించిందని తప్పుడు వదంతులు సృష్టించారన్నారు.రిజర్వు బ్యాంకు ముద్రించిన రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగించవచ్చని జిల్లాధికారి అక్రం పాషా తెలిపారు.
డిసెంబర్ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..
దీనిపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. రూ.10 నాణేన్ని ఆర్‌బీఐ నిషేధించలేదన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దన్నారు. బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయవచ్చన్నారు. రూ.10 నాణేలను స్వీకరించకపోతే 2011 సెక్షన్ 6(1) ప్రకారం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. రూ.10 నాణేలను ఉపయోగించడం వల్ల చిల్లర సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.
Share your comments