అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇటీవలే రామమందిర ప్రారంభోత్సవానికి ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. రామందిరం ట్రస్ట్ సభ్యుల ప్రకారం, అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అయోధ్యలో జనవరి నెల మూడోవారంలో రామజన్మ భూమి ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు జనవరి 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనున్నాయి.
రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపినట్లు తెలియజేసారు. మరొకవైపు సాధువులు, ప్రముఖులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలిపారు. రాబోయే రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన చర్చల సందర్భంగా, ప్రధాన కార్యక్రమం ఎటువంటి రాజకీయ ప్రభావం లేకుండా ఉంటుందని స్పష్టంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఆహ్వానాలు అందించారు. ఈ సందర్భంగా ఎలాంటి వేదిక, బహిరంగ సభ ఉండదని స్పష్టం చేశారు. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించేందుకు అద్భుతమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. తుది జాబితా సిద్ధమైన తర్వాత, ఈ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ నుండి వ్యక్తిగతంగా సంతకం చేసిన ఆహ్వానాలను అందుకుంటారు.
ఇది కూడా చదవండి..
పెరగనున్న ఉల్లి ధరలు .. కిలో 70 వరకు చేరవచ్చు !
"అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ చేసింది" అని రాయ్ చెప్పారు. ఈ 25,000 మంది సాధువులు, 10,000 మంది "ప్రత్యేక అతిధులు".. రామజన్మభూమి ఆవరణలో జరిగే పవిత్రోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
కోవిడ్-19 మార్గదర్శకాల ఫలితంగా, ఆలయ భూమి పూజా కార్యక్రమం ఆగస్టు 5, 2020న చాలా పరిమిత స్థాయిలో జరిగింది. ప్రస్తుతం, రాంలాలా గర్భగుడి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ప్రస్తుతం జనవరి నెలలో జరగనున్న 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని అన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments