ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నాణాలను విడుదల చేశారు.
నాణాల ప్రత్యేకత:ఈ నాణాలు గుండ్రంగా కాకుండా బహుభుజి ఆకారంలో ఉన్నాయి.
ఈ నాణెం మధ్యలో అశోక స్తంభం సింహాలు ఉన్నాయి.
వీటి తయారీకి నికెల్ వెండి మరియు ఇత్తడిని ఉపయోగించారు.
ఇవి ప్రత్యేకంగా అంధులు కూడా సులభంగా గుర్తించేలా రూపొందించారు.వీటిపై బ్రెయిలీ లిపి ముద్రించబడింది. దీని సహాయంతో అంధులు సులభంగా అర్థం చేసుకోగలరు.
ఇవి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' డిజైన్‌ను కలిగి ఉన్నాయి.
"ఈ కొత్త శ్రేణి నాణేలు 'అమృత్ కల్' లక్ష్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తాయి మరియు దేశాభివృద్ధికి కృషి చేసేలా ప్రజలను ప్రేరేపిస్తాయి" అని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశం వివిధ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేసిందని, వాటి సరైన వినియోగం కోసం వాటి గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సొల్యూషన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం జరగాలని ఆయన అన్నారు.
ముద్ర బ్యాంక్‌తో చిరు వ్యాపారులకు వేగంగా రుణాలు అందుతున్నాయని వెల్లడించారు.ఇంతకు ముందు పథకాల లబ్ధి కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజలపై ఉండేది. ఇప్పుడు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లడం వంటి విషయాలపై దృష్టి సారిస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 12 ప్రభుత్వ పథకాలలో ఒక్కొక్కటి జన్ సమర్థ్ పోర్టల్‌లో ప్రదర్శించబడుతుందని చెప్పారు. "ప్రభుత్వ పథకాలను పొందేందుకు పోర్టల్ సులభతరం చేయబోతోంది" అని ఆమె చెప్పారు.
మరిన్ని చదవండి.
Share your comments