News

రైతులకు చేదు వార్త .. PM కిసాన్ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ

Srikanth B
Srikanth B

గత కొన్ని రోజులుగా PM కిసాన్ డబ్బులు రూ. 6000 వేల నుంచి రూ . 8000 వేలకు పెంచుతారని అంచనాలు ఊహాగానాలు జోరుగా సాగాయి అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు దీనిపై పార్లమెంట్లోని సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర వ్యవసాయ మంత్రి రైతులకు చేదు వార్త తెలిపారు .

ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున కేంద్రం అందిస్తోంది. రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తానికి మరో రూ.2వేలు జత చేస్తారని, బడ్జెట్‌లో ఆ మేర బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

తాజాగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపుపై తాజాగా కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి పీఎం-కిసాన్‌ మొత్తాన్ని పెంచే ఉద్దేశమేదీ లేదని కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పారు. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి 30 వరకు అర్హులైన రైతులకు మొత్తం రూ.2.24 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులు సమకూరుస్తోంది.

Related Topics

PMKISANSAMANNIDI

Share your comments

Subscribe Magazine

More on News

More