News

90 వేల లోపు రైతు రుణాల మాఫీ .. అమలు అవుతోందా ?

Srikanth B
Srikanth B

తెలంగాణ రైతాంగం ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం రుణమాఫీ ఇప్పటివరకు కేవలం 37 వేల వరకు రుణమాఫీని చేసిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

37 వేల నుంచి 90 వేల లోపు రుణాలకు వర్తింపు బడ్జెట్‌లో 6,385 కోట్లు కేటాయింపుతో రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది .

ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గత బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.2,385 కోట్లు అధికంగా కేటాయించింది. ఈ నిధులతో రూ.37 వేల నుంచి రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం .


మరోవైపు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ బ‌డ్జెట్ 2023: ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ. 6,380 కోట్లే కేటాయించింది. అంటే అవసరమైన సొమ్ములో దాదాపు మూడో వంతు కేటాయించారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ బ‌డ్జెట్ 2023: ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine