ఆధునిక వ్యవసాయం, ప్రకృతి ఆధారిత వ్యవసాయం సహా ఈ 5 అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరపనున్న ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో వివిధ వ్యవసాయ అంశాలపై ప్రసంగించనున్నారు.
ప్రకృతి వ్యవసాయం రాశావణ రహిత వ్యవసాయం మరియు దాని విస్తరణ , అభివృద్ధి చెందుతున్న సాంకేతికను వ్యవసాయ రంగం లో ఉపయోగిచడం , అత్యాధునిక మరియు డిజిటల్ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ, చిరుధాన్యాల ప్రాముఖ్యత, వంటనూనెలో స్వావలంబనను పెంచడం, సహకార సంస్థల నుండి శ్రేయస్సు మరియు వ్యవసాయ-అనుబంధ రంగంలో మౌలిక సదుపాయాలలో పెట్టుబడికి ఆర్థిక సహాయం గురించి చర్చించనున్నారు .
గురువారం అంటే ఫిబ్రవరి 24న ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది . దీనిలో పై అంశాలపై ప్ర ధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ
ప్రసంగిస్తారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో ప్రభుత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానున్నారు .
వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, గురువారం ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైయ్యే ఈ ముఖ్యమైన వెబినార్, ప్రధానంగా ఐదు సెషన్లలో రోజంతా విస్తృతం గ చర్చను జరపనున్నారు . ప్రకృతి వ్యవసాయం రాశావణ రహిత వ్యవసాయం మరియు దాని విస్తరణ , అభివృద్ధి చెందుతున్న సాంకేతికను వ్యవసాయ రంగం లో ఉపయోగిచడం , అత్యాధునిక మరియు డిజిటల్ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ, చిరుధాన్యాల ప్రాముఖ్యత, వంటనూనెలో స్వావలంబనను పెంచడం, సహకార సంస్థల నుండి శ్రేయస్సు మరియు వ్యవసాయ-అనుబంధ రంగంలో మౌలిక సదుపాయాలలో పెట్టుబడికి ఆర్థిక సహాయం గురించి చర్చించనున్నారు .
ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వంప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు మరిన్ని అవకాశాలను కల్పించడం, వ్యవసాయ రంగం లో ఆధునికతను జోడించడం అనే అంశం ని దృష్టిలోవుంచుకొని ఈ చర్చలు సాగనున్నాయి .
ప్రధాని మోడీతో పలువురు కేంద్ర మంత్రులుపాల్గొననున్నారు
ఈ కార్యక్రమం లో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ఈ వెబినార్ లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రి 'పర్శోత్తం రుపాల', ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి 'పశుపతి పరాస్', వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి 'కైలాశ్ చౌదరి', సహకార శాఖ సహాయ మంత్రి 'బిఎల్ వర్మ'తో పాటు దేశంలోని అన్ని వ్యవసాయ సంస్థలతో పాటు మరికొందరు మంత్రులు, పలువురు నిపుణులు పాల్గొంటారు.
ఈ వెబినార్ లో జరిగే ప్రత్యేక సమావేశాలను వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, మత్స్య శాఖ కార్యదర్శి జెఎన్ స్వైన్, డిఎఆర్ కార్యదర్శి, ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మోహపాత్ర, పశుసంవర్థక, పాడి పరిశ్రమ కార్యదర్శి అతుల్ చతుర్వేది, ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షత వహించనున్నారు.
వ్యవసాయ రంగం వార్తలు చదవండి
Share your comments