News

BIG UPDATE!KISAN DRONE: 100 కిసాన్ డ్రోన్ లను ప్రారంభించిన ప్రధాని మోడీ

Srikanth B
Srikanth B

డ్రోన్ ల వినియోగం తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల స్తానం లోనిలబడిందని ఇది భారత దేశానికి నవ్యసామాజానికి ఒక కొత్త ఉత్సహం నింపుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు, ఎందుకంటే క్రిమిసంహారకాలు మరియు ఇతర వ్యవసాయ పదార్థాలను పిచికారీ చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 100 'కిసాన్ డ్రోన్లను' జెండా ఊపి ప్రారంభించారు.

డ్రోన్ స్టార్ట్-అప్ ల కొత్త సంస్కృతి భారతదేశంలో సిద్ధమవుతున్నట్లు ప్రధాన మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. వారి సంఖ్య త్వరలో 100 నుండి వేలల్లో ఉంటుందని , ఇది భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను ఉత్పత్తి చేయడానికి దారితీస్తుందని ,ఈ రంగం అభివృద్ధిలో ఎలాంటి అవరోధం లేకుండా తమ ప్రభుత్వం చర్యలు  తీసుకుంటుందని ,డ్రోన్ టెక్నిలోజి అభివృద్ధి కొరకు  ఇప్పటికే అనేక సంస్కరణలు మరియు విధాన చర్యలను చేపట్టిందని ఆయన అన్నారు.

 సమర్ధవంతమైన ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటే  దేశం ఎంత ఎత్తుకు ఎదగగలదో  ఇది ఒక ఉదాహరణ అని మోడీ అన్నారు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు డ్రోన్లు ఎక్కువగా రక్షణ రంగంతో వినియోగం లో ఉన్నాయని పేర్కొన్నారు, బడ్జెట్, విధాన చర్యల్లో టెక్నాలజీ, ఆవిష్కరణలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన అన్నారు.

డ్రోన్ రంగాన్ని అభివృద్ధి కి తమ ప్రభుత్వం ఎల్లపుడు అండ గ  ఉంటుందని , కానీ భారతదేశం యొక్క యువ విభిన్న ఆలోచన ధోరణితో  ముందుకు సాగాలి అన్నారు .డ్రోన్లకు విభిన్న ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్న మోదీ, గ్రామాల్లో భూ యాజమాన్యరికార్డును సృష్టించడం, మందులు, వ్యాక్సిన్లను రవాణా చేయడం లక్ష్యంగా 'స్వామిత్వ యోజన'లో వీటిని ఉపయోగించినట్లు తెలిపారు.

రైతులు రాబోయే కాలంలో అధిక సామర్థ్యం కలిగిన డ్రోన్లను ఉపయోగించి పండ్లు, కూరగాయలు మరియు పువ్వులు వంటి తమ ఉత్పత్తులను తక్కువ సమయంలో మార్కెట్లకు రవాణా చేయవచ్చు అని  21వ శతాబ్దంలో ఆధునిక వ్యవసాయ సౌకర్యాలను అందించడంలో ఇది ఒక కొత్త అధ్యాయం అని, డ్రోన్ రంగం అభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా కాకుండా కొత్త  అవకాశాలను కూడా సృష్టిస్తుంది అని  ఆయన అన్నారు.

ఆ తర్వాత మోదీ ట్వీట్ చేస్తూ, "దేశవ్యాప్తంగా 100 చోట్ల కిసాన్ డ్రోన్లు ప్రారంభించి నందుకు సంతోషం గావుందని . ఇది ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని , స్టార్ట్-అప్, @garuda_india వారికి ప్రశంశలు తెలిపారు . సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం మన రైతులకు సాధికారత ను ఇస్తుంది మరియు వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది." అయన అన్నారు .

ఇంకా చదవండి.

TELANGANA (PJTSAU):వ్యవసాయ రంగం లో డ్రోన్ వినియోగం కోసం కోర్సు ప్రారభించనునా (PJTSAU), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (krishijagran.com)

 

Share your comments

Subscribe Magazine