మరి కొన్ని రోజులలో పాఠశాలలు మొదలు కానున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది . రాబోయే విద్య సంవత్సరం 2023-24 విద్య సంవత్సరానికి మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వెజ్ బిర్యానీని ,కిచిడీని అందించనున్నారు . గతంలో ఉన్న మెనూను సవరిస్తూ కొత్త మెనూ లో వెజ్ బిర్యానీని ,కిచిడీని ఖచ్చితంగా విద్యార్థులకు అందించేలా కొత్త మెనూను రూపొందించారు.
మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం వెజ్ బిర్యానీ పెట్టాలని గత ఏడాది మెనులో చేర్చినప్పటికీ విద్యార్థులకు మాత్రం అందలేదు , దీనితో గతేడాది మధ్యాహ్న భోజన పథకం పనితీరును పరిశీలించిన కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాయింట్ రివ్యూ మిషన్ కమిటీ సభ్యులు వెజ్ బిర్యానీతో పాటు కిచిడి కూడా మెనులో చేర్చాలని మెనూ మార్చాలని సూచనలు చేసింది .
వేసవి సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలలు... పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజు నుంచే కొత్త మెనూను అమలు చేయాలనీ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 26 వేల పాఠశాలల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం క్రింద విద్యార్థికి 6 వ తరగతి వరకు రూ.5.45 7 -10 వ తరగతి విద్యార్థులకు 8. 17 రూపాయలు చెల్లిస్తుంది ప్రభుత్వం .
నేడు, రేపు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి వర్షాలు ..!
మధ్యాహ్న భోజనం మెనూ :
సోమవారం- కిచిడీ+ కోడి గుడ్డు
మంగళవారం- అన్నం+ సాంబారు
బుధవారం- అన్నం+ ఆకుకూర పప్పు+ గుడ్డు
గురువారం- వెజ్ బిర్యానీ
శుక్రవాం- అన్నం+ సాంబారు
శనివారం- అన్నం+ ఆకుకూర పప్పు
Share your comments