News

నేడు, రేపు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి వర్షాలు ..!

Srikanth B
Srikanth B
నేడు, రేపు తెలుగు రాష్ట్రాలలో  తేలికపాటి వర్షాలు ..!
నేడు, రేపు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి వర్షాలు ..!


తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు భగ భగ మంటున్న ఎండలు మరోవైపు ఎక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి . రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానున్న వేళా ఎండలు మరింతగా పెరగనున్న క్రమంలో వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది . రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు కూడా దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది .


ఇటు తెలంగాణా లోని రంగారెడ్డి ,వికారాబాద్ , యాదాద్రి ,జోగులాంబ గద్వాల్ ,ములుగు , భద్రాద్రి కొత్తగూడం ,నల్లగొండ ,సూర్యాపేట ,మహబూబ్నగర్ ,జనగాం,సిద్దిపేట జిల్లాలలో ఉరుములు ,మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది .

ఇది కూడా చదవండి .

గుడ్ న్యూస్..ఇళ్ల స్థలాలు, పోడు భూముల పంపిణీకి తేదీ ఖరారు చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో 43.4 డిగ్రీలు, అమరావతిలో 43.5, కొత్తవలసలో 41.9, వీరపునాయునిపల్లిలో 41.1, ఎర్రగుంట్లలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు, మూడు రోజులు పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఇది కూడా చదవండి .

గుడ్ న్యూస్..ఇళ్ల స్థలాలు, పోడు భూముల పంపిణీకి తేదీ ఖరారు చేసిన సీఎం

Share your comments

Subscribe Magazine