తెలంగాణ బీజేపీ ఇటీవల తన ఎన్నికల వాగ్దానాలను వెల్లడించింది, ఇది ప్రజల వివిధ సమస్యలను పరిష్కరించడానికి అనేక కట్టుబాట్లను కలిగి ఉంది. ప్రజలకు రిజర్వేషన్లతోపాటు రైతులు, ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది బీజేపీ పార్టీ. గౌరవనీయులైన కేంద్రమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆవిష్కరించబడిన ఈ మేనిఫెస్టో, సంపన్నమైన మరియు సామరస్యపూర్వకమైన తెలంగాణ కోసం పార్టీ దార్శనికతను వివరిస్తుంది.
బీజేపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న కీలక హామీలు ఇవే..
➨ ప్రతి సంవత్సరం రైతులకు రూ.18 వేలు
➨ ఆడపిల్ల పుట్టగానే వారికి రెండు లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్
➨ కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విచారణకు కమిటీ ఏర్పాటు
➨ మహిళా రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు
➨ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగాల నియామకాలు. యూపీఎస్సీ తరహాలో నియామకాలు, నోటిఫికేషన్లు
➨ ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ ఏర్పాటు
➨ అర్హత ఉన్న పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు
➨ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్.. కీలక హామీ ప్రకటించిన కేసీఆర్.. అదేమిటంటే?
➨ ప్రతి మండలంలో నోడల్ స్కూల్స్ ఏర్పాటు
➨ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ
➨ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
➨ అధికారంలోకి రాగానే బీసీ సీఎం హామీ
➨ సమ్మక్క-, సారక్క మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు
➨ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ
➨ ప్రతి రైతుకు ఉచిత పంట బీమా అమలు
➨ వరికి 3 వేల 100 రూపాయల మద్దతు ధర
➨ పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
ఇది కూడా చదవండి..
Share your comments