రైల్వే ప్రయాణికులకు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణికుడు రిజర్వేషన్ చేసుకున్నపటికి తనతో పాటు రైల్వే స్టేషన్ కి వచ్చే వారికీ ప్లాట్ ఫార్మ్ మరియు ఎక్కడైనా దగ్గర ప్రాంతాలకు వేలాలనుకునపుడు జనరల్ టికెట్ కోసం పెద్ద పెద్ద క్యూ లైన్ లో నిలబడవలసి ఉంటుంది దీనితో రైలు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి .
అటువంటి వారికోసం రైల్వే వారు రూపొందించిన యాప్ ఒకటి ఉత్తమముగా పని చేస్తుంది రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన 'యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)' యాప్ ద్వారా జనరల్ టిక్కెట్‌తోపాటు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పుతుంది. ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కూడా ఉండదు.
జనవరి చివరిలో భారత్ లో కి మరో 12 చిరుతలు ...
ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు , డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అవసరమైన సమాచారాన్ని పూరించాలి దీనితో మీ యాప్ ఇన్స్టల్ పూర్తవుతుంది . యాప్‌లో లాగిన్ అయిన తర్వాత జీపీఎస్ ఆన్ చేసి, కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జీపీఎస్ ద్వారానే ఇది పని చేస్తుంది. జీపీఎస్ ఆధారంగా 5-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్ టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్లు లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి లేదంటే యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం కష్టం .
Share your comments