బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth 2) గురువారం వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. అంతకు ముందు ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అందరూ స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కోటకు చేరుకున్నారు.
ఇటీవలి కాలం లో తర్వాత క్వీన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కొంత సమయానికి క్వీన్ ఎలిజబెత్ 2 మరణించారు. ఆమె మృతికి వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు సంతాపం తెలిపారు. 70 ఏళ్లపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత ఆమె మొదటి కుమారుడు ప్రిన్స్ చార్లెస్ ప్రోటోకాల్ ప్రకారం కింగ్ అయ్యారు. అయితే ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత బ్రిటన్‌ను పాలించేది ఎవరు? ఆమె ఆస్తులు ఎంత? కోహినూర్ వజ్రం(Kohinoor Diamond) ఉన్న క్వీన్ కిరీటం ఎవరికి దక్కుతుంది? వంటి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ ఉన్న కిరీటాన్ని ఎవరు ధరించే అవకాశం ఉందో తెలుసుకుందాం.
వ్యవసాయ క్షేత్రంలో అత్యున్నత అవార్డు "నార్మన్ E. బోర్లాగ్ " అందుకున్న తెలంగాణ శాస్త్రవేత్త !
ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ కింగ్ అయినప్పుడు, ఆయన భార్య కెమిల్లా క్వీన్ కన్సార్ట్ అవుతుందని ఈ ఏడాది ప్రారంభంలో క్వీన్ ఎలిజబెత్ 2 ప్రకటించారు. కింగ్ భార్యను క్వీన్ కన్సార్ట్‌గా పేర్కొంటారు. ప్రిన్స్ చార్లెస్ కింగ్ అవ్వడంతో కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని క్వీన్ కన్సార్ట్‌గా కెమిల్లా అందుకుంటుంది.
Share your comments