News

నాలా లో జీడిపప్పు కిలో 30/- రూ. అనే వార్త అబద్దమా ?అసలు నిజమేంటి?

KJ Staff
KJ Staff

ఈ మధ్య జార్ఖండ్లోని నాలా గ్రామం లో 20-30/- రూపాయలకే జీడిపప్పు కొనుకోవచ్చు అనే వార్త బాగా వైరల్ అయింది, అయితే అది ఎంత వరకు నిజం? అసలు అలా అక్కడ అమ్ముతుంది మంచి రకమైన జీడిపప్పు ఎనా అనే విషయం ఎవరు చర్చించట్లేదు. ఈ విషయమై కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జార్ఖండ్‌లోని జంతారా జిల్లాలోని నాలా అనే గ్రామంలో జీడిపప్పును అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.అందుకే ఈ ఊరుని "జార్ఖండ్ జీడిపప్పు నగరం"గా పిలుస్తారు

మామూలుగా 1 కిలో జీడిపప్పు ధర 800 నుండి 1200 వేల మధ్యలో పలుకుతుంది. అయితే అదే జీడిపప్పు నాలా గ్రామంలో 100-130 రూపాయలకు దొరుకుతుంది, కానీ ఇది పోలిష్ చేసిన జీడిపప్పు కాదు. అదే మనం తినే జీడిపప్పు లా వేరుచేసి , పోలిష్ చేసినవి కావాలి అంటే 400- 450 రూపాయలకు కిలో కొనొచ్చు . బయట రేట్లను బట్టి చుస్తే ఇవి చాల చవక అనే చెప్పాలి , కాని 30 రూపాయలు మాత్రం కాదు అని నేరుగా వెళ్లి చుసిన స్థానికులు చెప్తున్నారు.

అసలు ఈ తక్కువ ధరకి కారణం ఏంటంటే , నాలా గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలను వేశారు. 2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది. అంతేకాదు గ్రామస్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్పి జీడి తోటను పెంచే విధంగా చేసింది. అలా ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం అప్పట్లో ఐఏఎస్ కృపానంద ఝా ఎంతో కష్టపడ్డారు. ఆయన జంతారా జిల్లా డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ నాలా గ్రామం విశిష్టతను వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని పరిశోధకులతో చర్చించి అక్కడ నేలలు, నీటిని పరీక్షించేలా చేశారు.

అలా అటవీ శాఖ సాయం తో ఆ ఊరు జీడీ తోటగా మారింది.కానీ దాని వల్ల దళారులకు తప్ప రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, అలా కుప్పలుగా పోసి అమ్మేయడం వల్ల ఎక్క డనుండో వచ్చి తక్కువ ధర కు జీడిపప్పు కొనుకొన్ని పట్టికెళ్ళిపోతున్నారు , అదే ఊరిలో ప్రాసెసింగ్ యూనిట్స్ లను ఏర్పాటు చేసి , ఎక్సపోర్ట్ కు సహాయం చేస్తే ఆ ఊరి రైతులు కూడా లాభాలు చూసే అవకాశం ఉండవచ్చు.

Share your comments

Subscribe Magazine