కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు మంచి శుభవార్తను అందించింది. రబీ పంట సీజన్లో (2023 అక్టోబర్ 1 - 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇటీవలి పరిణామంలో, ఎరువులపై సబ్సిడీ కోసం 22,303 కోట్ల రూపాయల గణనీయమైన మొత్తాన్ని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదించింది.
గ్లోబల్ మార్కెట్‌లో ఎరువుల ధరలు స్థిరంగా పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రైతులపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించిన ప్రకారం, రైతులు మాత్రం డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఎరువును బస్తాకు పాత ధర రూ.1,350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని తెలిపింది.
తాజా నిర్ణయంతో కిలో నత్రజనిపై రూ.47.2, కిలో ఫాస్ఫరస్పై రు. 20.82, కిలో పొటాష్పై రూ.2.38, కిలో సల్ఫర్పై రూ.1.89 సబ్సిడీ లభించనుంది. ఇక టన్ను డీఏపీకి రూ.4500 సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం. ఎన్పీకే ఎరువు బస్తా రాయితీ ధర రూ.1470 లభించనుంది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ (మ్యూరియెట్ ఆఫ్ పొటాష్), సల్ఫర్ వంచి ఎరువుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లిపాయ ధరలు.. కిలో ఎంతంటే?
ప్రస్తుత సీజన్‌లో డిమాండ్‌ను మించి ఎరువులు ఎక్కువ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎరువుల లభ్యతపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, ఎరువుల నిల్వలపై భయాందోళనలు లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. ప్రత్యామ్నాయ ఎరువులు , నానో యూరియా వినియోగం, సేంద్రియ వ్యవసాయం వంటి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.
పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024-2025 రబీ సీజన్‌లో గోధుమ, బార్లీ, సన్ ఫ్లవర్, శనగ, ఆవాలు, మసూర్ సహా ఆరు ముఖ్యమైన పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇది కూడా చదవండి..
Share your comments