News

రైతు రుణ మాఫీపై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన

KJ Staff
KJ Staff
formers
formers

రైతు రుణ మాఫీ. బ్యాంకుల నుంచి పంట పెట్టబడి కోసం రైతులు తీసుకునే రుణం ఇది. రైతులకు ప్రత్యేకంగా క్రాప్ లోన్ ను అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. వీటికి వడ్డీ చాలా తక్కువగానే ఉంటుంది. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులకు ఈ రుణాలను బ్యాంకులు అందజేస్తాయి. పంట పెట్టుబడి కోసం చాలామంది రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ లోన్ ను తీసుకుంటున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు తీసుకునే ఈ రుణాలపై వడ్డీ చెల్లిస్తున్నాయి. ఇలాంటి పథకాలను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఏపీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రైతులు తీసుకునే వ్యవసాయ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. ఇక తెలంగాణలో కూడా ఇలాంటి పథకమే అమల్లో ఉంది. ఇక రైతు రుణమాఫీని చాలా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయనుంది. ఇక గత చంద్రబాబు ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ అమలు చేసింది. ఇక రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.

అయితే రైతు రుణాలను మాఫీ చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైతు రుణమాఫీ చేపట్టే ప్రతిపాదన తమ దగ్గర ఏమీ లేదని లోక్ సభలో క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు లోక్ సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ప్రకటించారు. 2008లో కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందిని, ఆ తర్వాత అలాంటి పథకాలను అమలు చేయలేదని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పంట రుణాలపై వడ్డీ తిరిగి చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Share your comments

Subscribe Magazine