NEW DELHI:బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం మరోసారి వివరణ ఇచ్చింది. బాయిల్డ్ రైస్ ని కొనుగోలు చేసేది లేదని కావాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సేకరించుకోవాలని తేల్చి చెప్పింది.
గత కొన్ని రోజుల నుండి బాయిల్డ్ రైస్ కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఘర్షణ తెలిసిందే. బాయిల్డ్ రైస్ ని రైతల నుండి కొనాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి నిరాకరిస్తుంది.లోక్‌సభలో ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి దీనికి సంబంధించి సమాధానం ఇచ్చారు. అవసరము అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అయిన సేకరించేది లేదని స్పష్టం చేశారు. ఇకపై బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్ సీజన్లోనే తెలియ పరిచామని వాఖ్యానించారు.అంతే కాకుండా 2020-21 ఖరీఫ్ సీజన్‌లో 47.49 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్, 6.33 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను సేకరించామని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ని ఎందుకు కోనట్లేదు?
సెంట్రల్ పూల్‌లో పెరిగిన బియ్యం నిల్వ స్థాయి కారణంగా FOOD CORPORATION OF INDIA బియ్యాన్ని కొనుగోలు చేసే స్థితిలో లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా వరి ధాన్యం అంచనాలకి మించి పండుతోంది అని వ్యవసాయంలో వైవిద్యం చూపించాలని వరి పంటకి బదులుగా వేరే పంటల్ని పండించాలని ప్రభుత్వం ఇంతకూ ముందే తెలియజేసింది.
మరిన్ని చదవండి.
Share your comments