
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 8వ విడత డబ్బులను మార్చిలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఈ నగదును రైతుల ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.
ఈ పథకానికి అర్హులై ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని రైతులు.. వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మార్వో ఆఫీసులోని పీఎం కిసాన్ సెంటర్ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Share your comments