News

BIG NEWS:రాష్ట్ర రుణాలపై కేంద్రం కోత .. తెలంగాణ సంక్షేమ పథకాలకు దెబ్బ!

Srikanth B
Srikanth B

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భయాందోళనలు నిజమయ్యాయి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FRBM ) కింద రాష్ట్ర ప్రభుత్వం అనవసర  రుణాలు తీసుకోకుండా కేంద్రం సోమవారం నిషేధం విధించింది. వివిధ రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో వర్చువల్ సమావేశంలో, కేంద్ర ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ ఈ ఆర్థిక సంవత్సరానికి (FRBM )  కింద తెలంగాణ ప్రభుత్వం రుణాలుతీసుకునేందుకు  కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది.

 

రైతు బంధు, దళిత బంధు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రానికి ఆందోళన కలిగించే అంశం అని  దానిని  “మేము పరిశీలిస్తాము” అని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అన్నారు.

రాష్ట్రానికి రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతించకపోతే, అది  రాజకీయ మలుపు తిరగవచ్చు. మరియు రాష్ట్రాల ముందు సుప్రీంకోర్టుకు వెళ్లడమే రాష్ట్రం ముందున్న ఎంపిక. సంక్షోభంపై చర్చించేందుకు శాసనసభ అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

“ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేరళ ఈ  మూడు రాష్ట్రాల ప్రత్యేకంగా గ ప్రభావం పడే అవకాశం వుంది  ఇప్పటికే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రుణం తీసుకునే అంశాన్ని  కేంద్రం రూ.30,000 కోట్లు తగ్గించింది. అదే నిబంధనలు తెలంగాణకు కూడా వర్తింపజేస్తే, 2022-23లో తెలంగాణకు ఎలాంటి ఋణం  లభించే అవకాశం లేదు అని ఆర్థిక నిపుణులు  వెల్లడించారు .

వరి ధాన్యం క్వింటాల్‌కు రూ. 2,500 !

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యగా మరియు పక్షపాత ధోరణిగా అభివర్ణించింది, బడ్జెట్-రహిత రుణాలను రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగా పరిగణించింది. ఇది అభివృద్ధి పనులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. HUDCO మరియు NCDC నుండి తీసుకున్న రుణాలు వంటి వాటిని రాష్ట్ర రుణాలుగా పరిగణిస్తూ కొన్ని అప్పులను FRBM కిందకు తీసుకురావడం కేంద్రం యొక్క పద్ధతిని వివక్షపూరితంగా పరిగణించింది.

2022-23 బడ్జెట్‌లో రూ. 53,970 కోట్ల రుణాలను సమీకరించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి త్రైమాసికంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ రుణాల సూచిక క్యాలెండర్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,000 కోట్లను సమీకరించాలని ప్రతిపాదించింది. ఈ అంచనాల  ప్రకారం, మే 2 వరకు రాష్ట్రం రూ. 6,000 కోట్ల రుణాన్ని సేకరించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ కి  రూ.30 వేల కోట్ల రుణం తీసుకునే సామర్థ్యాన్ని కేంద్రం తగ్గించింది. అదే నిబంధనలు TSకి వర్తింపజేస్తే, 2022-23లో రాష్ట్రానికి ఎలాంటి రుణం లభించకపోవచ్చు

"రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లను విద్యుత్ మీటర్లతో అనుసంధానం చేస్తాం" -సీఎం జగన్

Share your comments

Subscribe Magazine