News

రాష్ట్రంలో మరోసారి 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం !

Srikanth B
Srikanth B
Telangana and Andhra Pradesh
Telangana and Andhra Pradesh

ఈ మధ్య హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వానలు దంచికొట్టాయి.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగిందని..సోమవారం కూడా ఉపరితల ఆవర్తనం అక్కడే కొనసాగుతూ సముద్రం మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించిందని వాతావరణ శాఖ పేర్కొంది.

అంతే కాకుండా తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టంపై 4.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ లో సాధారణ వర్షపాతం నమోదు కానుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది.

దేశ అవసరాలకు సరిపడా ఆహార ఆహారధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి: కేంద్రం

మరోవైపు.. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ (శనివారం) తేలిక పాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దేశ అవసరాలకు సరిపడా ఆహార ఆహారధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి: కేంద్రం

Share your comments

Subscribe Magazine

More on News

More