తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. రేపు మంగళవారం నుండి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తుంది, ప్రాథమిక పాఠశాలలు రోజువారీ కార్యకలాపాలను ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయి.
అదేవిధంగా, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్ర 4.45 వరకు పని చేస్తాయి. ఈ మార్పు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మరియు విద్యార్థులు మరియు సిబ్బంది యొక్క భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యాశాఖ తాజా నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.
తెలంగాణాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్, హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా గత గురువారం నుంచి శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..
ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కస్టమర్లకు భారీ షాక్!
వాతావరణ కేంద్రం సోమవారం అప్రమత్తమైన హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సమగ్ర సమాచారాన్ని సేకరించి క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను అధికారులు ఆదేశించారు.
కానీ రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ స్కూల్లో తరగతి గదుల్లో పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. దీనితో బోధన జరిపే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు పాఠశాలలు తెరవడం మంచిది కాదు అని అంటున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments