News

ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కస్టమర్లకు భారీ షాక్!

Gokavarapu siva
Gokavarapu siva

భారతదేశపు కేంద్ర బ్యాంకు అయిన రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ఇటీవలి భారీ షాక్ ఇచ్చింది. రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలపైనా ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తుంది. ఇది బ్యాంక్ కస్టమర్లకు ఝలక్ అనే చెప్పాలి. డబ్బులు దాచుకోవాలని భావించే వారికి, తీసుకోవాలని యోచించే వారిపై కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. తాజాగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కొన్ని బ్యాంక్ లైసెన్స్ ని రద్దు చేసింది. ఆర్‌బీఐ ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడానికి గల కారణాలేమిటో మరియు ఆ ప్రతికూల ప్రభావాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇటీవలి రిసర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా యునైటెడ్ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. ఈ బ్యాంక్ కేంద్రం ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఈ బ్యాంక్ అక్కడి నుండే కార్యకలాపాలను కొనసాగిస్తుంది. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఈ బ్యాంక్ లైసెన్స్ ఎందుకు రద్దు చేసిందంటే, ఈ బ్యాంకులో సరిపడినంత మూలధనం లేకపోవడం, అలాగే ఆదాయ అంచనాలు కూడా కనిపించకపోవడంతో చేసింది. ఇకనుండి ఈ బ్యాంకులో డిపాజిట్లు స్వీకరించడం మరియు రుణాలు ఇవ్వడం లాంటి సేవలు ఉండవు. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాలి.

బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయబడిన సందర్భంలో, బ్యాంకులో ఖాతాల్లో డబ్బులు ఉన్న కస్టమర్ల పరిస్థితి ఏమిటి? అయితే, బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా డిపాజిటర్లు రూ. 5 లక్షల వరకు పరిహారంగా ఇస్తారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణాలో మరో పథకం .. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం..

అంటే రూ. 5 లక్షల వరకు డిపాజిట్ చేసిన వారికి ఎలాంటి సమస్యలు ఉండవని మరియు వారి నిధులు వారికి తిరిగి వస్తాయని హామీ ఇచ్చారు. అందువల్ల ఈ మొత్తం వరకు డిపాజిట్ చేసిన వారికి ఇబ్బంది లేదు. రూ. 5 లక్షలు దాటితే మాత్రం డబ్బులు రావు. కేవలం రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ఆ పైన మొత్తాన్ని మర్చిపోవాల్సిందే.

ఆర్‌బీఐ ప్రకారం, 99.98 శాతం మంది బ్యాంకు డిపాజిటర్లు తమ మొత్తం డబ్బును అందుకుంటారు. బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటే.. డిపాజిట్ దారులకు డబ్బులు కూడా చెల్లించే స్థితిలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే బ్యాంక్ కార్యకలాపాలను కొనసాగిస్తే.. డిపాజిట్ దారులపై మరింత ప్రభావం పడొచ్చని తెలిపింది. అందుకే ప్రజా ప్రయోజనాలను గుర్తించుకొని బ్యాంక్ లెసెన్స్ రద్దు చేశామని వివరించింది.

ఇది కూడా చదవండి..

తెలంగాణాలో మరో పథకం .. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం..

Related Topics

Rbi cancelled license

Share your comments

Subscribe Magazine