News

తెలంగాణాలో మరో పథకం .. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం..

Srikanth B
Srikanth B
తెలంగాణాలో మరో పథకం .. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం..
తెలంగాణాలో మరో పథకం .. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం..

ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించే విధంగా అనేక పథకాలను ప్రకటించుకుంటూ పోతుంది మొన్న BC లకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ముస్లిం మైనారిటీలను ఆకర్షించే విధంగా మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించనున్నతలు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం . దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్నా మైనార్టీలకు లక్ష రూపాయ ఆర్థిక సాయాన్ని అందించనుంది ప్రభుత్వం.

 

100 శాతం రాయితీపై లక్ష రూపాయ ఆర్థిక సాయాన్ని అందించనుంది . కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు . దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి భిన్న సంస్కృతులను, విభిన్న మతాల ఆచార సంప్రదాయాలను సమానంగా చూసే సంస్కృతి కొనసాగుతుంది తెలిపారు ముఖ్యమంత్రి కెసిఆర్.

వృద్దాప్య పింఛన్ మరో రూ.1,000 పెంపు?

విద్య, ఉపాధి సహా వివిధ రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతోందని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి.

వృద్దాప్య పింఛన్ మరో రూ.1,000 పెంపు?

Related Topics

cmkcr

Share your comments

Subscribe Magazine