News

స్పేస్ రైస్ అంటూ అంతరిక్షంలో వరి పంట పండించిన చైనా...

KJ Staff
KJ Staff
China Cultivates
China Cultivates
చైనా గత ఏడాది చంద్రయాన్ తో వరి పంట విత్తనాలను అంతరిక్షంలోకి పంపింది. 40 గ్రాముల బరువున్న 1,500 వరి విత్తనాలు స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమికి తీసుకొచ్చింది. దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ విత్తనాలను నాటారు.
ఈ విత్తనాలను కాస్మిక్ రేడియేషన్ అండ్ సున్నా గురుత్వాకర్షణకు గురైన తరువాత తిరిగి భూమికి తీసుకువచ్చారు. వాటి బరువు సుమారు 40 గ్రాములు. గ్వాంగ్డాంగ్లోని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పేస్ బ్రీడింగ్ రీసర్చ్ సెంటర్ లో స్పేస్ రైస్ (అంతరిక్షంలో పండించిన బియ్యం)మొదటి పంటను పండించారు. స్పేస్ రైస్ విత్తనం పొడవు 1 సెంటీమీటర్. మంచి, ఉత్తమమైన విత్తనాలను ప్రయోగశాలలలో పెంచి, ఆపై పొలాల్లో పండిస్తామని పరిశోధనా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గువో టావో తెలిపారు.
ఈ విత్తనాలు కొంతకాలంపాటు అంతరిక్ష వాతావరణంలో ఉన్న తరువాత చాలా మార్పులు జరుగుతాయి. వీటిని అంతరిక్షం నుండి తిరిగి తీసుకువచ్చిన తరువాత భూమిపై పండించిన పంట కంటే ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఇటువంటి ప్రయోగాలు వరితోనే కాదు, ఇతర పంటలతో కూడా ఉన్నాయి. చైనా వరి, ఇతర పంటల విత్తనాలను 1987 నుండి అంతరిక్షంలోకి తీసుకువెళుతోంది. దీని దిగుబడి సాధారణ వరి కంటే ఎక్కువగా ఉంటుంది అని చైనా వ్యవసాయ ప్రయోగ శాలలు చెపుతున్నాయి.

Related Topics

China Cultivates

Share your comments

Subscribe Magazine