డబ్బులు ఎవ్వరికి ఉరికిరావు అనేది మనకు బాగా గుర్తుండిపోయే యాడ్ వాస్తవానికి కూడా డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు కొన్ని సార్లు కష్టం తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళిఅనే రైతు విషయంలో గత సంవత్సరం టమాటో సాగు చేసిన మురళి ఈ సంవత్సరం ధైర్యం సాగు చేసాడు కష్టానికి తోడు అదృష్టం కలిసి రావడంతో 45 రోజులలో టమాటో అమ్మి నాలుగు కోట్లు సంపాదించాడు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళి అనే 48 ఏళ్ల రైతు తన టమోటా పంటతో సాగుతో జాక్పాట్ కొట్టాడు, కేవలం నెల రోజుల్లో నమ్మశక్యం కాని విధంగా రూ .4 కోట్లు సంపాదించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, గత కొద్దీ సంవత్సరంనుంచి ఎప్పుడు 50,000 రూపాయలను సంపాదించని మురళి ఏకంగా రోజులలో4 కోట్లు సంపాదించాడు .
మురళి విజయపథంలో కష్టాలు, ఎదురుదెబ్బలు ఉన్నాయి. గత ఏడాది టమాటా ధరలు పడిపోవడంతో అతని కుటుంబం తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయింది. ఏదేమైనా, మెరుగైన విద్యుత్ సరఫరా, మంచి పంట నాణ్యత మరియు అనుకూలమైన ధరల కలయిక అతని అదృష్టాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. దీనితో నెల రోజుల్లోనే కోటీశ్వరుడు అయ్యాడు .
మదనపల్లిలో మార్కెట్లో 45 ఏళ్ల చరిత్ర బ్రేక్ చేసిన టమాటో ..
మరో 15-20 దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అప్పులు తీర్చిన తర్వాత కూడా కేవలం 45 రోజుల్లో 2 కోట్లు సంపాదించగల్గన్నని అన్నారు మురళి.
Share your comments