News

మదనపల్లిలో మార్కెట్లో 45 ఏళ్ల చరిత్ర బ్రేక్ చేసిన టమాటో ..

Srikanth B
Srikanth B
మదనపల్లిలో మార్కెట్లో 45 ఏళ్ల చరిత్ర బ్రేక్ చేసిన టమాటో ..
మదనపల్లిలో మార్కెట్లో 45 ఏళ్ల చరిత్ర బ్రేక్ చేసిన టమాటో ..

టమాటో లేనిది కూర ఎలా వండాలి అని ఆలోచించే స్థాయికి టమాటో మరియు మనుషులకు బంధం ఏర్పడింది .. పెరిగిన ధరలతో ఇప్పుడు వంటగదిలో టొమాటోలు కనిపించకుండా పోతున్నాయి. ధరలు పెరిగి నేల అయిన టమాటో ధరలు దిగి రాలేదు ఇప్పుడైనా కొత్త టొమాటోలు మార్కెట్ లోకి వచ్చి ధరలు తగ్గుతాయని భావించిన రెండు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు ధరలు ఇప్పుడే తగ్గే అవకాశాలు లేవని తెలుస్తుంది.

 


దానికి ఉదాహరణగా ఈరోజు మదనపల్లిలో మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా మదనపల్లిలో మార్కెట్లో 45 ఏళ్ల చరిత్రలోనే రికార్డు ధర పలికింది అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 ను దాటేసింది.. ఈ రోజు మార్కెట్లో కిలో టమోటా ధర 208 రూపాయలుగా పలకగా.... ఇక, 25 కేజీల టమోటా బాక్స్‌ ధర 5200 రూపాయిలు పలికింది.. మరోవైపు సాధారణ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.230 నుండి రూ.250 వరకు పలుకుతోంది.. మొత్తంగా 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నయా రికార్డులను సృష్టించింది టమోటా ధర.

దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా పంటలన్నీ నీటమునిగి లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది దీనితో రానున్న రోజులలో టమాటో ధరలు మరింత పెరగనున్నాయి ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్టుకు వెళ్లాలన్న భయపడుతున్నారు.

Related Topics

black tomatoes

Share your comments

Subscribe Magazine