News

18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

KJ Staff
KJ Staff

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దేశంలో సెకండ్ వేవ్ పంజా విసురుతున్న క్రమంలో.. ఆంక్షలు కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అవసరమైతేనే లాక్‌డౌన్ విధించాలని, రాత్రి కర్ఫ్యూ లాంటివి అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

రోజూ 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో.. అన్ని రాష్ట్రాలు దాదాపు రాత్రి కర్ఫ్యూ విధించాయి. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్ విధించి కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరోవైపు కరోనాను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తోంది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్, 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించగా.. ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తోంది. నాలుగో విడతలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తోంది.

అయితే 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటే.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. కొవిన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

-cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
-ఆ తర్వాత మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
-ఆ తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి
-రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
-howఅందులో గుర్తింపు కార్డు అప్ లోడ్ చేయడంతో పాటు పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి.

Share your comments

Subscribe Magazine