News

సీఎం భరోసా..అకాల వర్షాలతో నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు..

Gokavarapu siva
Gokavarapu siva

ఇటీవలి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడ్డాయి. ఈ అకాల వర్షాలతో రైతులకు పండించిన పంటలు అధిక మొత్తంలో నష్టపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పర్యటించారు. ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఖమ్మం జిల్లా, బోనకల్ మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి రైతులకు ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలను నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు అధైర్య పడకూడదని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న డబ్బులను నష్టపరిహారం అని కూడా అనకూడదు, వాటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మహాద్భాగ్యం స్కీంలో మొక్కజొన్న పంటకు ఎకరానికి రూ.3,333, వరి పంటకు రూ.5400, మామిడి తోటలకు రూ.7200 అందజేయిస్తామని ఉంది, కానీ రైతులకు ఇవి ఏమాత్రం సరిపోవని అన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ డబ్బులను వేంటనే నష్టపోయిన రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: వైఎస్సార్ ఆసరా డబ్బులు అప్పుడే

ఈ నష్టపరిహారం డబ్బులను రైతులతో పారు కౌల రైతులకు కూడా అందేలా అధికారులకు ఆదేశాలు ఇస్తాం అని తెలిపారు. ఎందుకంటే పంట పండించడానికి పెట్టుబడులు పెట్టింది కౌలు రైతులు, వారికి నష్టం వాటిల్లకుండా చూసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. వారికి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఈవిధంగా ముఖ్యమంత్రి కౌలు రైతులకు కూడా భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో ఈ అకాల వర్షాల వలన నష్టం వాటిల్లిందని తెలిపారు. మొత్తం అన్ని పంటలు కలిపి17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. వీటిలో వరి 72,709 ఎకరాలు, మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు. వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ రైతులు అధైర్య పడవద్దని, ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని రైతులకు భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: వైఎస్సార్ ఆసరా డబ్బులు అప్పుడే

Related Topics

Telangana Govt

Share your comments

Subscribe Magazine

More on News

More