News

మహిళలకు శుభవార్త: నేడే మహిళల ఖాతాలో .. వైఎస్సార్ ఆసరా డబ్బులు

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి అనేక పథకాలను తీసుకువస్తుంది. దీనిలో భాగంగా రైతుల కొరకు ఇన్పుట్ సబ్సిడీలను అందించడం, పంటలు పండించడానికి రుణాలు అందించడం మరియు రైతులకు అనేక వాటిలో సబ్సిడీలను అందించి రైతులకు ఆర్ధికంగా సహాయం అందిస్తుంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కొరకు అందిస్తున్న వైఎస్సార్ ఆసరా నిధులను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న పథకం వైఎస్సార్ ఆసరా. ఇప్పటికే ఈ పథకం కింద మహిళలకు రెండు విడతల డబ్బులను ఇప్పటికే ప్రజల ఖాతాల్లో ప్రభుత్వం వేసింది. ఈ వైఎస్సార్ ఆసరా మూడో విడత డబ్బులను త్వరలోనే మహిళల ఖాతాల్లోకి వేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆసరా డబ్బులను ఈ నెల 25న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు.

'వైఎస్సార్‌ ఆసరా' పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే 'ఆసరా' పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. 

జిల్లాలో వచ్చేనెల ఏప్రిల్‌ 5వ తేదీ వరకూ ఆసరా ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌ నుంచి హౌసింగ్‌, మనబడి నాడు-నేడు, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్‌ ఆసరా, పోషణ పక్వాడా, రాగిజావ పంపిణీ తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఇది కూడా చదవండి..

స్త్రీనిధి నిధులతో సబ్సిడీలపై సోలార్ పానెల్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈనెల 25న ఏలూరు జిల్లా దేందలూరులో వైఎస్సార్ ఆసరా డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.6419 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మహిళలకు లబ్ది చేకూరుతుంది.

ఇది కూడా చదవండి..

స్త్రీనిధి నిధులతో సబ్సిడీలపై సోలార్ పానెల్స్..

Related Topics

ysr aasara

Share your comments

Subscribe Magazine

More on News

More