News

ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన చేయనున్న CM జగన్‌

Srikanth B
Srikanth B
ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన చేయనున్న CM జగన్‌
ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన చేయనున్న CM జగన్‌

నేడు నర్సాపురం పర్యటనలో భాగంగా పీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ లకు శంకుస్థాపనచేయనున్నారు . అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవనికి ముఖ్య అతిధి గ హాజరయ్యి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు .

 

ఏపీ ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ లను తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో మూడో ఆక్వా విశ్వవిద్యాలయం నరసాపురంలో ఏపీ ప్రభుత్వం స్థాపిస్తుంది. దీని కోసం 350 ఎకరాల్లో 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ కు ఆమోదం లభించింది. ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరుకానున్నారు . నరసాపురం నియోజకవర్గ పర్యటనలో సుమారు 3వేల 197 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది .

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. ఈనెల 29న ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ .. !

అలాగే 490 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణం, 429 కోట్లతో ఫిషింగ్ హార్బర్, 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, 133 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్, 87 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు, నరసాపురం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మోళ్లపర్రులో 180 కోట్లతో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం, 13కోట్లతో నరసాపురం పట్టణంలో వంద పడకల ఆసుప్రతి నిర్మాణం చేపడుతుంది. 4.80 కోట్లతో ఆధునీకరించిన ఆర్టీసీ క్లాంపెక్స్ ను జగన్ ప్రారంభిస్తారు. దర్భరేవు కాళీపట్నంలో జమీందారీ భూములు పంపిణీ చేస్తారు. 35 కోట్లతో కోతకు గురైన గోదావరి ఏటీకొట్టు అభివృద్ధి పనుల నిర్మాణం, 31 కోట్లతో వీఆర్ ఛానల్ అండ్ శేషవతారం ఛానల్ అభివృద్ధి నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు .

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. ఈనెల 29న ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ .. !

Share your comments

Subscribe Magazine