News

అలా చేస్తే ఎకరానికి 42 క్వింటాళ్ల దిగుబడి... వరిసాగుపై రైతులకు కేసీఆర్ సూచన

KJ Staff
KJ Staff
vaari panta
vaari panta

తెలంగాణలో వరిసాగు ఎక్కువగా ఉంది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్‌లో ఉన్నట్లు ఇటీవల పలు నివేదికల్లో తేలింది. అయితే వరిసాగులో అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలనే దానిపై రైతులకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. వెదజల్లే పద్దతిలో వరిసాగు చేయాలని రైతులకు సూచించారు. మడులల్లో నారు పెంచి నాట్లు వేసే పద్దతిలో శ్రమ, వ్యయం ఎక్కువగా ఉంటుందన్నారు.

అదే వెదజల్లే పద్దతిలో ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చులు తగ్గుతాయని, అంతేకాకుండా పంటకాలం కూడా 10 రోజులు తగ్గుతుందని కేసీఆర్ తెలిపారు. తన వ్యవసాయక్షేత్రంలో ఈ పద్దతిలో వరిసాగు చేశామని, గత ఏడాది ఎకరానికి 42 క్వింటాళ్లు దిగుబడి వచ్చినట్లు కేసీఆర్ వివరించారు. సాధారణ పద్దతిలో కంటే ఇది ఎక్కువ దిగుబడి అని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతులు మార్కెట్ డిమాండ్ కు అనుకూలంగా పంటలు పండించాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో కావాల్సినన్ని రైస్ మిల్లులు లేవని, మిల్లులు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. గతంలో 60గా ఉన్న మిల్లులు గత ఏడేళ్లల్లో 400కి చేరుకున్నాయన్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

రైతు కేంద్రంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు మంచిగా ఉండే ఊరు కూడా బాగుంటుందన్నారు. తెలంగాణలో పండిన పత్తికి మంచి డిమాండ్ ఉందని, పత్తిని కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో 93 శాతం చిన్న కమతాలేనని, రైతు బీమా ప్రపంచంలోనే ఎక్కడా లేదని కేసీఆర్ తెలిపారు.

Share your comments

Subscribe Magazine