తెలంగాణాలో ఎన్నికల రాజకీయం మొదలైయ్యింది ఇప్పటికే వివిధ పార్టీలు అనేక ఎన్నికల హామీని ప్రకటిస్తున్నాయి . తాము అధికారంలోకి వస్తే వృద్దాప్య పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అటు అధికార పార్టీ కూడా వృద్దాప్య పెన్షన్ ను పెంచనున్నట్లు నిన్న సూర్యపేట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన చేశారు.
బహిరంగ సభలో ముఖ్య మంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తన జన్మహక్కుల రూ. 1000 పెన్షన్ ఇవ్వలేదని.. రూ. 200 పెన్షన్ ముఖాన కొట్టారని గతంలో రూ.200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రూ. 4 వేలు అంటుందని.. వాళ్లు నాలుగు వేలు ఇస్తే నేను ఇంకో వెయ్యి రూపాయలు పెంచాలేనా అని అన్నారు.
ఇది కూడా చదవండి.
రుణమాఫీ కోసం 20 లక్షల మంది రైతుల ఎదురుచూపు ..
పెన్షన్లను ఎంత మేర పెంచుతామనేది రానున్న రోజుల్లలో వెల్లడిస్తామని .. తెలంగాణాలో 4 వేలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో వున్నా రాష్ట్రాలలో ఎందుకు ర . 4 వేలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అంటున్నారని ఆలా జరిగితే రైతులు మళ్లీ దరఖాస్తులతో ఆఫీసుల చూట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. ఒకసారి ధరణిలో భూమి ఎక్కితే ఎవరు మార్చలేరని ఆ అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదని ఇదే విషయం పై రైతులు ఆలోచించాలని తెలిపారు . ధరణి రద్దు చేస్తే రైతుల సమస్యలు మళ్ళి మొదటికి వస్తాయని స్పష్టం చేసారు.
Share your comments