News

రుణమాఫీ కోసం 20 లక్షల మంది రైతుల ఎదురుచూపు ..

Srikanth B
Srikanth B
రుణమాఫీ కోసం 20 లక్షల మంది రైతుల ఎదురుచూపు ..!image source -photopea
రుణమాఫీ కోసం 20 లక్షల మంది రైతుల ఎదురుచూపు ..!image source -photopea

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దీనిని దఫాల వారీగా అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగం గ నే గత వారం రూ. 99,999 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల రుణామాఫీకి నిధులు విడుదల చేసింది.

 

అయితే లక్ష వరకూ రుణమాఫీ కావాల్సిన రైతులు 20.02 లక్షల మంది ఉన్నారు. ఇప్పటిదాకా రూ. 99,999 వరకు ఉన్న రుణాల మాఫీకే నిధులు విడుదల కావడంతో వీరంతా ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు . ఒక రూపాయి కట్ ఆఫ్ తో 20 లక్షల మంది రైతుల రుణమాఫీ జరగలేదు . ఈ 20 లక్షల మందికి రుణమాఫీ కోసం రూ.11,445.95 కోట్లు అవసరం అంటే మొత్తం రుణమాఫీలో సగం కంటే తక్కువ మందికే రుణమాఫీ జరిగింది . 36.68 లక్షల మంది రైతుల రుణమాఫీకి 19,198.38 కోట్లు అవసరం అని లెక్కగట్టిన ప్రభుత్వానికి సంపురం రుణమాఫీ చేయడనికి ఇంకా రూ.11,445.95 కోట్లు రైతు రుణాలను మాఫీ చేయాల్సివుంది.

ఇది కూడా చదవండి.

PM కిసాన్ పథకం 15వ విడతను పొందాలనుకుంటే ఈ పనులు చేయండి..

 


మేనిఫెస్టో ప్రకారం డిసెంబర్ 11, 2018 నాటికి వచ్చిన వడ్డీతో సహా రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది.ఈ హామీని సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ప్రసంగిస్తూ పునరుద్ఘాటించారు. నాలుగేళ్లలో రైతులకు రుణభారం నుంచి విముక్తి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అందించిన తాజా డేటా ప్రకారం, నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికిమొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ తేల్చింది. వీరిలో ఇప్పటివరకు 16.66 లక్షల మందికి మాఫీ కాగా, ఇంకా 20.02 లక్షల మందికి మాఫీ జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి.

PM కిసాన్ పథకం 15వ విడతను పొందాలనుకుంటే ఈ పనులు చేయండి..

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine