News

రైతులకు శుభవార్త : లక్ష లోపు రుణాలు అన్ని మాఫీ

Srikanth B
Srikanth B
రైతులకు శుభవార్త : లక్ష లోపు రుణాలు అన్ని మాఫీ -CM KCR
రైతులకు శుభవార్త : లక్ష లోపు రుణాలు అన్ని మాఫీ -CM KCR

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి  కేసీఆర్‌ మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈమేరకు ఈ రోజు 99 వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావుకు ఈరోజు ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5,809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

రైతులకు చెందిన రుణాలు మాఫీ చేయడానికి రూ.19,198.38 కోట్లు అవసరమని సర్కార్ నిర్ణ యించింది. సోమవారం రూ.99,999 వరకు లోన్ఉ న్న 10.79 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ.6,546.05 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16.66 లక్షల మందికి రైతులకు సంబంధించిన రూ.7753.43 కోట్ల క్రాప్లోన్లు మాఫీ చేసినట్లయిం ది. అయితే ఇంకా 14.34 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.లక్ష వరకు ఉన్న రుణాలు పెండింగ్ ఉన్నాయి. వీటిని మాఫీ చేయాలంటే రూ.11,445.95 కోట్లు అవసరం.

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine