కొమరం భీమ్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవనాలను ఈ నెల 17న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.
రూ.24.68 కోట్లతో కొమరం భీమ్ ఆదివాసీ భవన్ నిర్మించగా, రూ.24.43 కోట్లతో సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించారు. 2016-17 సంవత్సరంలో రెండు సొగసు భవనాల పనులు ప్రారంభించారు.
కొమరం భీమ్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవనాలను ఈ నెల 17న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.
రూ.24.68 కోట్లతో కొమరం భీమ్ ఆదివాసీ భవన్ నిర్మించగా, రూ.24.43 కోట్లతో సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించారు. 2016-17 సంవత్సరంలో రెండు సొగసు భవనాల పనులు ప్రారంభించారు.
తెలంగాణ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టింది . భారతదేశంలో మొట్టమొదటి ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయం తెలంగాణలో స్థాపించబడింది. గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. గిరిజన సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
సికింద్రాబాద్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన ప్రధాని:మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్సగ్రేషియా!
గిరిజన యోధుడు కొమరం భీమ్ , బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు .
!ఆసియాలోనే అతి పెద్దదైన 'సమ్మక్క-సారలమ్మ' జాతరను నిర్వహించడంతో పాటు 'నాగోభ జాతర', 'జంగూబాయి జాతర', 'భౌరాంపూర్ జాతర', 'ఎరుకల నాంచారమ్మ జాతర', 'గాంధారి మైసమ్మ జాతర' తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఎనిమిదేళ్లలో సమ్మక్క-సారలమ్మ జాతరతోపాటు ఇతర గిరిజన జాతరల నిర్వహణ, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.354 కోట్లు వెచ్చించింది.
కోయ గిరిజన తెగ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శించడానికి మేడారంలో సమ్మక్క-సారలమ్మ మ్యూజియం ఏర్పాటు చేయడమే కాకుండా జోడేఘాట్‌లో కొమరం భీమ్ స్మారక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మ్యూజియంల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.22.53 కోట్లు వెచ్చించింది.
హైదరాబాద్‌లో మూడు , జిల్లా కేంద్రాల్లో 10 సహా రూ.75.86 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 32 ఆదివాసీ, బంజారా భవనాలను ప్రభుత్వం నిర్మించింది . ఈ భవనాలు 12 ఎస్టీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Share your comments