News

సికింద్రాబాద్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన ప్రధాని:మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్సగ్రేషియా!

Srikanth B
Srikanth B

సికింద్రాబాద్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్సగ్రేషియా , గాయపడిన బాధితులకు 50,000 PMNRF ద్వారా అందించనున్నట్లు PMO ప్రకటనను విడుదల చేసింది .

సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ పైన ఉన్న హోటల్‌కు మంటలు వేగంగా వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ ఏరియా, షోరూం, బేస్‌మెంట్‌లోని వాహనాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు, పొగలు రావడంతో హోటల్ సిబ్బంది, అతిథులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు .

సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురికి గాయాలు
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ నిచ్చెన సహాయంతో బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకుపోయిన ఏడుగురు అతిథులను రక్షించారు. క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని మరో రెండు ఆస్పత్రులకు తరలించారు.

పశుసంవర్ధక శాఖ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ దీనిని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు మరియు గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లాడ్జిలో ఉంటున్న వారు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారేనని తెలిపారు.

ఘటనా స్థలాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సందర్శించారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

వింత ఘటన :శపథం నెరవేరే వరకు గెడ్డం చేసుకోనని ప్రతిజ్ణ.. చివరికి 21 ఏళ్ల గెడ్డం చేసుకున్న వ్యక్తి !

Share your comments

Subscribe Magazine