News

వింత ఘటన :శపథం నెరవేరే వరకు గెడ్డం చేసుకోనని ప్రతిజ్ణ.. చివరికి 21 ఏళ్ల గెడ్డం చేసుకున్న వ్యక్తి !

Srikanth B
Srikanth B

Chhattisgarh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆమధ్య ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. 2013లో ఆయన శపథం చేయగా..

ఎట్టకేలకు 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. దీంతో 15 ఏళ్ల తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన చెప్పులు ధరించారు. ఇలాంటి శపథాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నాయకుల శపథాలు నీటి మూటలవుతుంటాయి. కానీ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు కొంచెం నిక్కచ్చిగానే శపథం చేస్తుంటారు. 

ఈ శపథం చేసిన వ్యక్తి పేరు రాంశేఖర్ గుప్త. మహేంద్రగఢ్ నివాసి, ఆర్‭టీఐ కార్యకర్త. ఈయన చేసిన డిమాండ్ ప్రకారం.. గతేడాదిలోనే మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్‭పూర్ ప్రాంతాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన పోయిన ఏడాది ఆగస్టులో గెడ్డం చేసుకున్నారు. అయితే జిల్లా ఏర్పాటు చర్యలు ప్రారంభం కాలేదు. దీంతో మరోసారి గెడ్డం శపథం చేశారు. కాగా, తాజాగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఏడాది తర్వాత మరోసారి గెడ్డం చేసుకున్నారు.

ఛత్తీస్‭గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఇలాగే ఒక శపథం చేశారు. తమకు ప్రత్యేక జిల్లా కావాలని.. మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్‭పూర్ ప్రాంతాలను జిల్లాగా ప్రకటించేంత వరకు తాను గెడ్డం చేసుకోనని అప్పుడెప్పుడో 21 ఏళ్ల క్రితం శపథం చేశారు. తాజాగా ఈ మూడు ప్రాంతాల కలయికలో 32వ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంతో శుక్రవారం ఆయన తన గెడ్డం చేసుకున్నారు.

నేడు ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022ని ప్రారంభించనున్న- ప్రధాని

Share your comments

Subscribe Magazine