News

ఇళ్ల పట్టాలు రాని పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

KJ Staff
KJ Staff
CM Jaganmohanreddy
CM Jaganmohanreddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని సోమవారం ప్రారంభించారు.  పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి..  వైఎస్సార్‌ జగనన్న కాలనీలో తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను పనులను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో ఇళ్లు లేని అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వుతో పండుగ జరుగుతుందన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. శ్రీకాళహస్తిలో 7 లక్షల రూపాయల విలువైన ప్లాట్‌ను అక్కాచెల్లెమ్మలకు ఇస్తున్నాం’ అన్నారు.

ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో, ఇళ్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం చూడలేదు, చివరకు రాజకీయాలు చూడలేదు, వారు ఏ పార్టీ వారు అని కూడా చూడలేదు. నాకు ఓటు వేయనివారైనా సరే అర్హత ఉన్నవారందరికీ ఇళ్ల స్థలాలు రావాలనే దృక్పథంతోనే అడుగులు ముందుకువేశాం. ఒక బాధ్యతగా ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నాం. స్థలం కొనుగోలు చేసి మరీ ఇస్తున్నాం. 

రూపాయి విలువ మహిళకు తెలిసినంతగా మగవాళ్లకు తెలియదని... ప్రతీ రూపాయిని మహిళలు జాగ్రత్తగా ఖర్చు చేస్తారని పేర్కొన్నారు సీఎం జగన్‌. అందుకే మహిళల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నామని.. రాజకీయంగా, ఆర్థికంగా మహిళలను ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టాలని కృష్టి చేస్తున్నామని స్పష్టం చేశారు.  

ఇళ్లు మాత్రమే కట్టించడం కాదు.. ఆ ఇళ్లకు సంబంధించి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, ఇంకా ఇటువంటి మౌలిక సదుపాయలు కల్పించేందుకు దాదాపుగా రూ. 7 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేయబోతున్నాం. ఇంకా ఈ కాలనీల విస్తీర్ణాన్ని బట్టి, జనాభా సంఖ్యను బట్టి పార్కులు, స్కూళ్లు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్, కమ్యూనిటీ హాల్స్‌ తీసుకురాబోతున్నాం  మని స్పష్టం చేశారు.  

ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం

ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు.
ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్‌కి కొంత, పిల్లర్స్‌కి కొంత, స్లాబ్‌కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.
ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.

Share your comments

Subscribe Magazine