News

శ్రీలంక నుంచి ప్రపంచ దేశాలకు పయనమైన కొబ్బరి కల్లు?

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం తాటికల్లు, ఈతకల్లు గురించి విని ఉన్నాం. ఈ కల్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు లభ్యమవుతుంది. ఎంతో మంది కార్మికులు ఈ కల్లు గీయడాన్ని తమ వృత్తిగా భావిస్తారు. అయితే ఇప్పటివరకు మనం ఈ తాటి, ఈత కల్లు గురించి విన్నాం కానీ.. కొబ్బరి కల్లు గురించి చాలామంది విని ఉండరు.తాటి, ఈత కల్లు మాదిరిగానే కొబ్బరి కల్లుకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కొబ్బరి కల్లును శ్రీలంకలో కొబ్బరి చెట్ల నుంచి తీసి ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

కొబ్బరి చెట్ల నుంచి తీసే ఈ కల్లు శ్రీలంకలో ఎంతో ఫేమస్. ఈ కొబ్బరి కల్లు తయారు చేయడానికి కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగిస్తారు. కొబ్బరి చెట్ల నుంచి తీసే ద్రవంలోకి కొద్దిగా నీటిని కలిపి ఈ కల్లును తయారు చేస్తారు. ఈ కళ్ళు చెట్టు నుంచి తీసిన వెంటనే కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని గంటల తరువాత ఈ ద్రవంలో కిణ్వన ప్రక్రియ వేగంగా జరిగి అల్కహాల్ 6 శాతానికి పెరుగుతుంది.దీన్ని విస్కీ, బ్రాందీ తరహాలో స్వేదన ప్రక్రియకు గురిచేస్తారు. ఈ క్రమంలోనే కొబ్బరి కల్లును ఒక మత్తుపానీయంగా సేవిస్తారు.

ప్రస్తుతం ఈ కొబ్బరి కల్లును ప్రస్తుతం సింగపూర్, జపాన్ దేశాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు.విదేశాల్లో చక్కటి మత్తు పానీయంగా, కాక్‌టైల్‌లో వినియోగించే ద్రావకంగా దీన్ని మార్కెట్ చేస్తున్నారు. ఇతర దేశాలలో ఎంతో డిమాండ్ ఉన్న కల్లును త్వరలోనే భారతదేశంలో కూడా పరిచయం చేయనున్నారు.చాలామంది పెద్దవారు స్నేహితులను, బంధువులను కలవడానికి వెళ్లినప్పుడు ఈ కల్లును తీసుకువెళ్లి వారికి బహుమానంగా ఇస్తుంటారు. ఈ విధంగా శ్రీలంకలో తయారైన కొబ్బరికల్లు ప్రపంచ దేశాలకు ప్రయాణించి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine