News

ఒక్క క్లిక్‌తో ఈ-వ్యవసాయం... అన్నీ ఇందులోనే

KJ Staff
KJ Staff

అన్ని రంగాల్లోనే టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. సులువుగా సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకు టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. దీంతో ప్రతిరంగంలోనూ టెక్నాలజీ వినియోగం కీలకంగా మారింది. అలాగే వ్యవసాయ రంగంలోనూ టెక్నాలజీ బాగా పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక్క క్లిక్‌తో సమస్త సమాచారం మన చేతుల్లోకి వచ్చేస్తోంది.

ఇప్పుడు వ్యవసాయ సమాచారం కూడా ఒక్క క్లిక్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది. రైతులకు సమాచారం ఇచ్చేందుకు, వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, రైతుల అనుమానాలు నివృత్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిపేరే ఈ వ్యవసాయం.

https://apagrisnet.gov.in/ పేరుతో ఈ వ్యవసాయం వెబ్‌సైట్‌ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో రైతులకు కావాల్సిన సమగ్ర వివరాలు ఉంటాయి. వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు, సేంద్రీయ వ్యవసాయం, పంటల యాజమాన్యం, సాగు, వాతావరణంకి సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి.

సాయిల్ హెల్త్ కార్డు, ల్యాబ్స్ వివరాలు, యాంత్రీకరణకు సంబంధించి వివరాలన్నీ ఉంటాయి. అలాగే మార్కెట్‌లో పంటల ధరలు ఎలా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఎలాంటి పంటలు వేయాలనే వివరాలు కూడా ఉంటాయి. ఇలా రైతులకు కావాల్సిన సమగ్ర సమాచారం ఇందులో లభిస్తుంది.

ఈ వెబ్‌సైట్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. దీంతో కొద్దిగా చదువున్నవారు కూడా సులువుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విత్తనాలు నాటే దగ్గర నుంచి పంటను మార్కెట్‌కి తరలించే వరకు కావాల్సిన అన్ని వివరాలు తెలుగులోనే ఉంటాయి. పండ్ల పెంపకం, చేపలు, రొయ్యలు పెంపకంతో పాటు పాడి రైతులకు కావాల్సిన సమగ్ర వివరాలను ఇందులో పొందుపర్చారు.

Share your comments

Subscribe Magazine