ఎలిజబెత్-II మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన చేస్తూ,
"గౌరవనీయురాలు రాణి ఎలిజబెత్-II మన కాలంలో ఒక మహోన్నత వ్యక్తి గా ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆమె తన దేశానికి, ప్రజలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించారు. ఆమె ప్రజా జీవితంలో గౌరవ, మర్యాదలను వ్యక్తీకరించారు. వారి మృతి నాకెంతో బాధను కలిగించింది. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, యు.కె. ప్రజలకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను."
“నేను 2015, 2018 సంవత్సరాల్లో యు.కె. సందర్శించిన సమయంలో గౌరవనీయురాలు రాణి ఎలిజబెత్-II తో పలు చిరస్మరణీయమైన సమావేశాలు నిర్వహించాను. వారి అభిమానం, ఆప్యాయతలను నేను ఎప్పటికీ మరచిపోలేను. వారి వివాహానికి మహాత్మాగాంధీ బహుమతిగా ఇచ్చిన చేతిరుమాలును, నాకు ఒక సమావేశంలో ఆమె చూపించారు. వారు ప్రదర్శించిన హావభావాలు ఎప్పటికీ నా మనసులో నిలిచి ఉంటాయి." అని పేర్కొన్నారు.
Share your comments