కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేసింది. రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో అనేక అంశాల పై ద్రుష్టి సారించనుంది. యువతకు ఉపాధి అవకాశాల నుండి, పర్యావరణ పరిరక్షణ వరకు అన్ని అంశాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసింది. ఈ మ్యానిఫెస్టోలో రైతుల సమగ్రాభివృద్ధికోసం రూపొందించిన అంశాల గురించి తెలుసుకుందాం.
ముందుగా బీజేపీ/ఎన్డిఏ పాలనలో రైతుల సమస్యలు పట్టించుకునే నాధుడు లేడని ప్రస్తావించారు. రైతులు పండించిన పంటలకు, న్యాయబద్ధమైన ధర లభించట్లేదని, మరియు వారి ఉత్పత్తులను విక్రయించేందుకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంలో, వ్యవసాయ కూలీలకు తీరని అన్యాయం జరిగిందని, వారికి సంవత్సరం పొడవునా పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలియచేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే రైతుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరానికి కృషి చేస్తుందని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు, వ్యవసాయ కూలీలా అభ్యున్నతికి అమలుచేయనున్న, కార్యాచరణల గురించి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు పండించిన పంటలకు, కనీస మద్దతు ధర లభించేటట్లు, చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ పేర్కొన్న విధంగా ప్రతీ సంవత్సరం ఎంఎస్పి అమలు చేస్తామని, గారంటీ ఇచ్చారు. అలాగే పంట విక్రయించిన తర్వాత డబ్బును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. వ్యవసాయ ఫైనాన్స్ కు సంభందించి, సమయానుసారంగా, లోన్ అవసరాల గురించి నివేదిక అందించే ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం అమలవుతున్న పంట భీమా పథకంలో మార్పులు చేసి బీమాను రైతుల అవసరాలకు తగ్గట్టు ఎంచుకోగలిగేలా సవరించి, అలాగే పంట నష్టానికి రావాల్సిన భిమాను 30 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమచేస విధంగా పనిచేస్తామని తెలిపారు. రైతులు తాము పండించిన పంటలు నేరుగా వినియోగదారులకు విక్రయించుకోవడానికి వీలుగా రీటైల్ మార్కెట్లు ఏర్పాటుచేస్తామని భరోసా ఇచ్చారు, తద్వారా రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పంట ఉత్పత్తుల ఎగుమతి మరియు దిగుమతి పాలసీలు రైతులకు మేలు చేసే విధంగా చేస్తామని హామీఇచ్చారు.
వ్యవసాయ అనుబంధ రంగాలైన, ఉద్యాన, చేపల చెరువులు, పట్టుపురుగుల పెంపకం మొదలగు రంగాలపై అవగాహనా కల్పించి, వ్యవసాయంలో వైవిధ్యం పెంచే విధంగా చొరవ తీసుకుంటాం అని తెలిపారు. అలాగే పౌల్ట్రీ, డైరీ రైతుల ఆదాయం ఐదు ఏళ్లలో డబల్ చేస్తామని పేర్కొన్నారు. వ్యవ్యసాయ పరిశోధనలకు తగిన నిధులు సమకూరుస్తామని, మారియు పరిశోధనను రైతుల వద్దకు తీసుకువెళ్ళడానికి మరిన్ని కృషి విజ్ఞన కేంద్రాలు స్థాపిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రతీ రాష్ట్రంలో వ్యవసాయ మరియు వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Share your comments