News

AP:ఇక టిప్పర్, లారీ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర.... గుడ్ న్యూస్ చెప్పిన జగన్.....

KJ Staff
KJ Staff

మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా, వైస్ జగన్ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సర్వతరా ఎన్నికలు జరుగుతుండగా, పార్టీలు అన్ని జోష్ పెంచి నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా, అన్ని పార్టీలు తాము అధికారంలోకి వచ్చాక అందించబోయే ఎన్నికల హామీలను ప్రజల ముందు ఉంచుతున్నారు.

ఇకపోతే వైస్సార్సీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా, బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రను కడపలో మొదలుపెట్టి, చిత్తూర్ మీదుగా, నెల్లూరు వరకు చేరుకున్నారు. వైస్ జగన్, నెల్లూరు జిల్లాలో, ఆటో, లారీ టిప్పర్ డ్రైవర్లతో భేటీ అయ్యారు. తిరిగి మల్లి తమ పార్టీ అధికారంలోకి రాగానే, సొంత లారీ, టిప్పర్లు కలిగి ఉన్న డ్రైవర్లకు కూడా వాహన మిత్ర అందిస్తామని తెలియచేసారు. ఇప్పటివరకు ఆంధ్రా ప్రదేశ్లో, సొంత ఆటో, టాక్సీ కలిగి ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర పథకం లభించింది. ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు ప్రోత్సహకాల రూపంలో ఈ వాహన మిత్ర అందించారు. వాహన మిత్ర పథకానికీ ఇప్పటివరకు 1,296 కోట్ల నిధులు వ్యాచించినట్లు తెలియపరిచారు.

లారీ, ఆటో డ్రైవర్ల భేటీలో, వైస్సార్సీపీ పార్టీ ప్రారంభించినాటినుండి, పార్టీ కార్యకర్తగా సేవలు అందిస్తున్న,వీరాంజనేయులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు ప్రస్తావించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ని చట్టసభలో కూర్చోబెట్టాలి అనే ఉదేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక టిప్పర్ డ్రైవరుకి పార్టీ సీట్ ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శించిన, ఎంఏ ఎకనామిక్స్ మరియు బిఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన వీరాంజనేయులు వంటి వ్యక్తి తమ పార్టీలో ఉండటం గర్వకారణమని తెలిపారు. మల్లి తమ ప్రభుత్వమే అధికారంలోకి రానున్నట్లు జగన్ ధీమా వ్యక్తం చేసారు.

Share your comments

Subscribe Magazine