News

అధికారం లో రాగానే 2 లక్షలు రుణమాఫీ !

Srikanth B
Srikanth B

మంచిర్యాల జిల్లా నస్పూర్ లో కాంగ్రెస్ జై భారత్ సత్యాగ్రహ సభ నిర్వహించింది కాంగ్రేస్ పార్టీ ఈ సభకు కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నస్పూర్ లో ఈ సభ నిర్వహించారు.

ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటాం. గ్యాస్ సిలెండర్ ను రూ . 500 వందలకే అందిస్తామని ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళా రైతుల రుణమాఫీ అంశం పై అన్ని పార్టీలు దృష్టి సారించాయి , తెలంగాణ ప్రభుత్వం 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఇప్పటివరకు కేవలం 35 లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసింది మిగిలిన రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పెరిగిన వడ్డీతో బ్యాంకులలో అప్పు రెండింతలు అయింది .

రైతులపై అధన చార్జిల భారం..హమాలీ చార్జిలు ఎంతంటే?

రుణమాఫీ పై తెలంగాణ ప్రభుత్వం :

రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2023-24 బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

ప్రస్తుతం రూ.90 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని వివరించారు. 2014లో ఇచ్చిన హామీ మేరకు 35.81 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. 2018లో రూ.21,556 కోట్లు అవసరమని అంచనా వేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు రూ.36 వేల వరకు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.

రైతులపై అధన చార్జిల భారం..హమాలీ చార్జిలు ఎంతంటే?

Share your comments

Subscribe Magazine