MSME మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ని అమలు చేస్తోంది, వ్యవసాయేతర రంగంలో సూక్ష్మ-సంస్థలను స్థాపించడం ద్వారా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనను సులభతరం చేస్తుంది.2008-09లో ప్రారంభమైనప్పటి నుండి, సుమారు 7.8 లక్షల సూక్ష్మ పరిశ్రమలు రూ. 19,995 కోట్ల సబ్సిడీతో స్థాపించబడ్డాయి. సుమారుగా 64 లక్షల మందికి స్థిరమైన ఉపాధిని కల్పించింది. దాదాపు 80% యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి మరియు 50% యూనిట్లు SC, ST మరియు మహిళా వర్గాలకు చెందినవి.
PMEGP ఇప్పుడు రూ.13554.42 కోట్లతో 2021-22 నుండి 2025-26 వరకు ఐదు సంవత్సరాల పాటు 15 వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్‌ను కొనసాగించడానికి ఆమోదించబడింది. ఇప్పటికే ఉన్న స్కీమ్‌లో కింది ప్రధాన మార్పులు చేయబడ్డాయి
ప్రాజెక్టు గరిష్ట వ్యయాన్ని ప్రస్తుతమున్న రూ.25 లక్షల నుంచి రూ. రూ.50 లక్షలకి తయారీ యూనిట్లకు, సర్వీస్ యూనిట్లకు ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచబడింది. అంచనా ప్రకారం ఈ పథకం ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 40 లక్షల మందికి స్థిరమైన అంచనా ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది.
సబ్సిడీ రేటు :ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుదారులకు, SC, ST, OBC, మహిళలు, లింగమార్పిడి, శారీరక వికలాంగులు, NER, దరఖాస్తుదారులకి పట్టణ ప్రాంత ప్రాజెక్ట్ వ్యయంలో 25% మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 35%, జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులకు పట్టణ ప్రాంత ప్రాజెక్ట్ వ్యయంలో 15% మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 25% సబ్సిడీ అందనుంది.
మరిన్ని చదవండి.
Share your comments