News

CORONA: తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు, మొత్తం ఆక్టివ్ కేసులు తెలుసుకోండి

S Vinay
S Vinay

దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో సుమారుగా 4,32,389 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగ అందులో 1,270 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి 1,567 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా ఉంది.

Telangna:తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో సుమారుగా 17,000 కి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో 9 కొత్త కేసులు, రంగారెడ్డి జిల్లాలో మరొక 5 కేసులు నమోదు అయినట్లు గుర్తించారు.దాదాపుగా 21 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.మరో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణ లో తాజాగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 492 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,91,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,86,578 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 492 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన మృతులు 4111.

కరోనా తగ్గుముఖం:
కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది చిన్నారులు ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన విశాద ఘటనలు కూడా చూసాము. అయితే ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అంటూ విజృంభించిన కరోనా ప్రస్తుత తగ్గుముఖం అయినట్లే కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా చూసుకున్నట్లైతే కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి వీటి మరణాల రేటు కూడా తగ్గిపోయింది.

మార్చ్ 31 నుండి కోవిడ్ నిబంధనలు ఎత్తివేత:
దేశ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు కోవిద్ నింబంధనలను రద్దు చేయాలనీ ఆదేశించింది అయినప్పటికీ ప్రజలు మాస్కులు ధరించాలని మరియు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది.

మరిన్ని చదవండి

చైనాలో లాక్‌డౌన్.. విజృంభిస్తున్న' కరోనా ' ఓమిక్రాన్ వేరియంట్ !

Share your comments

Subscribe Magazine